- Advertisement -
నవతెలంగాణ-చిన్న శంకంపేట
ఆడుకుంటూ వెళ్లి చిన్నారి నీటి బకెట్లో పడి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుదిబండ స్వప్న మోడల్ పాఠశాలలో పనిచేస్తుంది. ఆమెకు 18నెలల కూతురు రుచిత ఉంది. రుచిత అమ్మమ్మ అంజమ్మ ఇంటి వద్దనే ఉంటూ పాప ఆలనా పాలనా చూసుకుంటుంది. ఈ క్రమంలో శుక్రవారం రుచిత కాలకృత్యాలను శుభ్రం చేస్తూ అంజమ్మ బయటకు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి రూచిత బకెట్ నీళ్లలో పడి ఉంది. ఆమె చిన్నారిని బయటకు తీసి సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు.
- Advertisement -



