Monday, September 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండాక్టర్ల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి

డాక్టర్ల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి

- Advertisement -

మేడిపల్లిలోని సత్య పాలీక్లినిక్‌లో ఘటన

నవతెలంగాణ-బోడుప్పల్‌
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆరేండ్ల చిన్నారి మృతిచెందిన ఘటన మేడ్చల్‌ జిల్లా మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లోని బోడుప్పల్‌ కార్పొరేషన్‌లోని సత్య పాలీక్లినిక్‌లో ఆదివారం జరిగింది. ఈ ఘటనతో బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు క్లినిక్‌ ఎదుట ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్లితే.. బోడుప్పల్‌ కార్పొరేషన్‌లో నివాసముండే కొండ రాజు, లావణ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు హాసిని (6)కి వారం రోజులుగా జ్వరం, వాంతులు, బలహీనత వంటి లక్షణాలు కనిపించడంతో ఇటీవల పరీక్షలు చేయించగా ఆమెకు జాండీస్‌, డెంగ్యూ పాజిటివ్‌ అని తేలింది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం జ్వరం మరింత పెరగడంతో తల్లిదండ్రులు ఆమెను బోడుప్పల్‌ దేవేందర్‌ నగర్‌లోని సత్య పాలీ క్లినిక్‌లో చేర్పించారు.

క్లినిక్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి హాసిని మృతి చెందింది. డాక్టర్‌కు అర్హత లేకున్నా చికిత్స చేయడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ క్లినిక్‌ ఎదుట ఆందోళన నిర్వమించారు. మృతురాలి తండ్రి కొండ రాజు పేయింటర్‌గా, తల్లి లావణ్య వాచ్‌మన్‌గా పనిచేసుకుంటూ సరూర్‌నగర్‌లో నివసిస్తున్నారు. చిన్నారి మృతిచెందడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వైద్యుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -