- Advertisement -
సంగారెడ్డి జిల్లా భీంరా గ్రామంలో ఘటన
నవతెలంగాణ-కంగ్టి
పల్స్ పోలియో వేసిన 20 నిమిషాలకే మూడు నెలల బాలుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీంరా గ్రామంలో ఆదివారం జరిగింది. బాలుని తల్లిదండ్రులు స్వర్ణలత, ఉమాకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం స్థానిక పోలీయో కేంద్రంలో బాలుడికి పల్స్ పోలియో వేయించారు. పోలియో వేసిన 20 నిమిషాలకే ఆ బాలునికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. దాంతో వెంటనే కంగ్టిలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మరో ఏడు నెలల బాలికకు కూడా వాంతులు, విరోచనాలు కావడంతో ఖేడ్‌కు తరలించారు.
- Advertisement -