నవతెలంగాణ – బజార్ హాత్నూర్
బాల్య వివాహాలను అరికట్టాలని డిహెచ్ఈడబ్ల్యూ ఆర్థిక అక్షరాస్యత నిపుణుడు నిఖిలేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ మిషన్ శక్తి మహిళా సాధికారత కేంద్ర ఆధ్వర్యంలో చైల్డ్ మ్యారేజ్ 30 రోజుల క్యాంపెన్లో మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో బాల్య వివాహ ముక్త్ భారత్ పై కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాల వలన కలిగే అన్ని రకాల అవరోధాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించి ఒకవేళ మన చుట్టుపక్కల బాల్య వివాహాలు జరిగితే వాటి గురించి సమాచారం చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి అందించాలని, బాలలందరూ వారికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు వినియోగించుకుంటూ హక్కులకు ఎటువంటి భంగం కలిగిన వెంటనే నెంబర్ కి కాల్ చేసి సమస్యను చెప్పాలని తెలిపారు. పిల్లలందరూ క్రమశిక్షణతో మెలిగి వారి జీవితంలో అభివృద్ధి చెంది తద్వారా వారి సమాజానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్ ఎన్జీవో మండల కోఆర్డినేటర్ నారాయణ, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, టీచర్స్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
బాల్యవివాహాలను అరికట్టాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



