Friday, April 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతాపగిరి అంగన్వాడిలో బాలల పరిరక్షణ కమిటీ

ప్రతాపగిరి అంగన్వాడిలో బాలల పరిరక్షణ కమిటీ

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామ అంగన్వాడి కేంద్రంలో గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీ (VLCPC), ఆరోగ్య లక్ష్మి (ALMSC) కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అంగన్వాడి కేంద్రాల సేవలను ప్రతి తల్లి వినియోగించుకోవాలని సూచించారు. గ్రామంలోని ప్రతి చిన్నారి అంగన్వాడి, ప్రభుత్వ పాఠశాలలకు హాజరు కావడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంగన్వాడి కేంద్రంలో ఏవైనా మరమ్మతులు అవసరమైతే గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

అలాగే గ్రామస్థాయిలో బాల్య వివాహాలు జరగకుండా నిరోధించడం మన అందరి బాధ్యత అని పేర్కొంటూ, అందరూ సమిష్టిగా కృషి చేసి బాల్యవివాహాలను అరికట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం పిల్లలకు యూనిఫాం  పంపిణీ పంపిణీ చేయగా, కిశోర బాలికలకు పల్లి పట్టీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజయ్య, సూపర్వైజర్ శివరాణి, పంచాయతీ కార్యదర్శి శంకరయ్య, వార్డు సభ్యులు, ఆశ కార్యకర్తలు, పిల్లల తల్లిదండ్రులు  అంగన్వాడి టీచర్లు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -