Monday, December 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాలల పరిరక్షణ మనందరి బాధ్యత: ఎంఈఓ

బాలల పరిరక్షణ మనందరి బాధ్యత: ఎంఈఓ

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
బాలల పరిరక్షణ మన అందరి బాధ్యతని ఎంఈఓ మంగ్యా నాయక్ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పట్టణంలోని నాలుగైదు వార్డులలో సోమవారం బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలలను పరిరక్షించేందుకు గ్రామస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. స్కూల్ డ్రాప్ అవుట్, బాల్య వివాహాలు,  బాల కార్మికులు, చైల్డ్ అబ్యూస్, డ్రగ్స్, అక్రమ దత్తత వంటి సమస్యలపై వివరించారు. పట్టణ పరిసర ప్రాంతాలలో ఈ జరగకుండా ప్రజలు సహకరించాలని కోరారు. నిర్భయ చట్టం కమిటీ సెల్ నెంబర్సె దారం మల్లేష్ యాదవ్ కమిటీ సభ్యులందరూ సమిష్టిగా కృషిచేసి మన ఏరియాలో ఎటువంటి సమస్య లేకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ కళ్యాణ్, సూపర్వైజర్ నాగమణి, పోలీస్ ఆఫీసర్స్ఆశ్రిత, ఎన్జీవో సభ్యులు కవిత, అంగన్వాడి టీచర్స్ బొందు పార్వతి, సిహెచ్ రామానుజమ్మ, లలితమ్మ, రజిత, లత, తల్లుల కమిటీ సభ్యులు బి పద్మ, రమ్య, ఆర్పీలు బి నరసమ్మ, సాలమ్మ, ఝాన్సీ, హైమావతి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -