Sunday, June 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

- Advertisement -

నవతెలంగాణ – చౌడాపూర్ : వీధికుక్కల దాడిలో ఓ చిన్నారికి తీవ్ర గాయాలైన ఘటన చౌడాపూర్ మండలం పాచావ్ కుంట తండాలో ఆదివారం చోటుచేసుకుంది. తండాకి చెందిన నాగేష్, నీలా ల కూతురు జయ శ్రీ ఇంటి వద్ద ఆడుకుంటున్న సమయంలోఅక్కడే మకాం వేసిన వీధి కుక్కలు చిన్నారిపై దాడి చేశాయి. వెంటనే కుటుంబీకులు చిన్నారిని మహబుబ్ నగర్ హాస్పిటల్‌కు తరలించారు. వీధి కుక్కల దాడిని నిర్మూలించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తండావాసులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -