Friday, April 10, 2026
E-PAPER
Homeజాతీయందేశవ్యాప్తంగా చైల్డ్‌ ట్రాఫికింగ్‌ ముఠాలు

దేశవ్యాప్తంగా చైల్డ్‌ ట్రాఫికింగ్‌ ముఠాలు

- Advertisement -

ఈ అంశాన్ని తేలికగా తీసుకోవద్దు
ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం హెచ్చరిక
విచారణ ఈనెల 29కి వాయిదా


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశ వ్యాప్తంగా పిల్లల అక్రమ రవాణా(చైల్డ్‌ ట్రాఫికింగ్‌) ముఠాల అంశాన్ని తేలికగా తీసుకోవద్దని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. ఈ అంశంపై ధర్మా సనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమస్య తీవ్రమైన శాంతిభద్రతల ఆందోళనలకు సంబంధించినదని, రాష్ట్ర స్థాయిలో తక్షణ చర్యలు అవసరమని నొక్కి చెప్పింది. చైల్డ్‌ ట్రాఫికింగ్‌ అంశంలో పింకి వర్సెస్‌ ఉత్తరప్రదేశ్‌, ఇతరులకు సంబంధించిన పిటిషన్‌పై విచారణలో భాగంగా గురువారం జస్టిస్‌ పార్ధివాలా, జస్టిస్‌ కెవి విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ” పిల్లల అక్రమ రవాణా అంశం చాలా తీవ్రమైంది. రోజు రోజుకు ఈ కేసులు పెరగడాన్ని మనం గుర్తిస్తున్నాం.

అప్పుడప్పుడు పిల్లలను తిరిగి తీసుకు వస్తున్నట్టు నివేదికలు ఉన్నాయి. అంటే ఈ సమస్య పరిష్కరించవచ్చని అర్థం. దీనికి కావాల్సింది సంకల్పం మాత్రమే. అందువల్ల చిత్తశుద్దితో పని చేయండి. మేము పర్యవేక్షిస్తూ… అవసరమైన ఆదేశాలు జారీ చేస్తాం’ అని స్పష్టం చేసింది. కోర్టు గత ఉత్తర్వుల పాటించని పలు రాష్ట్రాల హోం సెక్రెటరీలు ఆన్‌లైన్‌లో హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ ‘చైల్డ్‌ ట్రాఫికింగ్‌ అరికట్టడంలో 2025 ఏప్రిల్‌ 15 నాటి తమ తీర్పులోని ఆదేశాలను పాటించని రాష్ట్రాలకు తుది అవకాశం ఇస్తున్నాం. ఏప్రిల్‌ 18 లోపు అఫిడవిట్‌లు దాఖలు చేయాలి. అలా కాకుండా ఆదేశాలు పాటించని, నివేదికలు దాఖలు చేయని రాష్ట్రాలను ‘డిఫాల్టింగ్‌ స్టేట్స్‌’ గా పరిగణిస్తాం’ అని హెచ్చరించింది.

అయితే చైల్డ్‌ ట్రాఫికింగ్‌ నేరాలపై కాల పరిమితితో కూడిన దర్యాప్తు, విచారణ జరిగేలా చూడాలని ఏప్రిల్‌లో ఇచ్చిన ఆదేశాల్లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పెండింగ్‌లో ఉన్న విచారణపై సమాచారాన్ని సేకరించి ఆరునెలల్లో వీలైతే రోజువారీగా వాటిని పూర్తి చేసేలా సర్క్యూలర్‌ జారీ చేయాలని హైకోర్టులను ఆదేశించింది. అయితే మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గోవాలతో పాటు మొత్తం 13రాష్ట్రాలు గత ఆదేశాలనుసారం రివ్యూ కమిటీలను వేయక పోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చైల్డ్‌ ట్రాఫికింగ్‌ సమస్యను తేలికగా చూడడం సరికాదని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 29 కి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -