దేవరాంపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల లోని దేవరాంపల్లి అంగన్వాడీ కేంద్రంలో శనివారం బతుకమ్మ, దసరా సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు, స్థానిక మహిళలు తీరొక్క రంగు పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేయడంతో పండుగ వాతావరణం ముందుగానే నెలకొంది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భగా టీచర్ ఒన్న కమల దేవి మాట్లాడుతూ .. బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల ప్రతీక అని, ఇలాంటి వేడుకలు పిల్లల్లో పండగల ప్రాశస్త్యాన్ని తెలియజేస్తయన్నారు. మన సంస్కృతిని భావితరాలకు చేరవేయడంలో ఈ కార్యక్రమాలు ముఖ్యపాత్ర పోషిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, విద్యార్థుల తలిదండ్రులు పాల్గొన్నారు.
బతుకమ్మ సంబరంలో చిందులేసిన చిన్నారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES