సెక్టార్ మీటింగ్లో సిడిపిఓ మమత
నవతెలంగాణ – మిర్యాలగూడ 
ప్రభుత్వ చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని సిడిపిఓ రేఖల మమత అన్నారు. శుక్రవారం పట్టణంలోని సీతారాంపురం సెక్టార్ పరిధిలో నందిపాడు అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన సెక్టార్ మీటింగ్లో ఆమె పాల్గొని మాట్లాడారు. పిల్లల యొక్క దత్తత గురించి వివరించారు. దత్తత అనేది ప్రభుత్వ పరంగా చాలా సులభమని, ప్రభుత్వమే చట్టబద్ధంగా దత్తత ఇస్తుందని చెప్పారు. అంగన్వాడీ టీచర్స్ తమ పరిధిలోని లబ్ధిదారులను ఎప్పటికప్పుడు గృహ సందర్శనలు నిర్వహించి, మొదటి సారి పాప ఉండి రెండవసారి, మూడవ సారి గర్భిణీ లుగా ఉన్న వారి యొక్క పిల్లల పైన నిరంతర పర్యవేక్షణ లో ఉండి వారి యొక్క పిల్లల పైన అవగాహన కలిగి ఉండాలన్నారు. 
ప్రస్తుత అంగన్వాడీ కేంద్రం నుండి వేరే చోటుకి వెళ్లే గర్భిణీ లను, వేరే దగ్గర రిజిస్ట్రేషన్ అయ్యే టీచర్ ద్వారా లబ్ధిదారుల యొక్క పర్యవేక్షణ కలిగి ఉండాలని కోరారు. అక్రమ దత్తత, శిశు విక్రయాలు, లింగ నిర్ధారణ తదితర చర్యలు జరగకుండా అంగన్వాడీ టీచర్స్ ,వారి యొక్క పరిధిలో అవగాహన కల్పించాలనన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పారు. ఆడపిల్లలకు ప్రభుత్వం చేపట్టిన ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించి వివరించారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నుండి వెంకన్న ప్రభుత్వం నుండి దత్తత ఎలా తీసుకోవాలి, అనే విషయాలు వివరించారు. ఈ విషయాలు ప్రజలకు వివరించి అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సెక్టార్ సూపర్వైజర్: సిహెచ్ పద్మ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ మెంబర్ వి. రమణి, బ్లాక్ కో ఆర్డినేటర్ కవిత,సెక్టార్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

 
                                    