Wednesday, February 18, 2026
E-PAPER
Homeఆదిలాబాద్చిన్నపిల్లలను అంగన్వాడి కేంద్రాలకు పంపించాలి

చిన్నపిల్లలను అంగన్వాడి కేంద్రాలకు పంపించాలి

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
మూడు నుంచి ఐదు సంవత్సరాల లోపు చిన్నపిల్లలను తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకే పంపించాలని మండలంలోని చింతగూడ గ్రామ సర్పంచి సుతారి సుమలత వినయ్ కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని బుధవారం చింతగూడ గ్రామపంచాయతీ పరిది లోని అంగన్వాడీ 1 లో ప్రభుత్వం నుండి వచ్చిన యూనిఫామ్ లు పంపిణీ చేశారు..  అంగన్వాడి కేంద్ర నిర్వహణ, గురించి తెలుసుకున్నారు. అనంతరం రిజిస్టార్లను పరిశీలించారు. ఆ అంగన్వాడి కేంద్ర పరిధిలో ఉన్న  గర్భిణీ స లకు బాలింతలకు  కోడిగుడ్లు పంపిణి  చేశారు. అనంతరం తాటి శ్రీమత్ పటేల్ కు అక్షరాబ్యాసం, కస్తూరి వేదానిషి కి అన్న ప్రాసన చేశారు. గర్భిణీలు బాలింతలు చిన్నారులు అంగన్వాడి కేంద్రాల్లో ఇచ్చే ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలన్నారు. ఈ  కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ తాటి అనిత, ఏఎన్ఎం  భూక్యా రాజేశ్వరి, ఆశ కార్యకర్త కందుల స్వరూప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -