Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్చిన్నారులను అంగన్వాడీకి పంపాలి: సూపర్వైజర్ అరుణ

చిన్నారులను అంగన్వాడీకి పంపాలి: సూపర్వైజర్ అరుణ

- Advertisement -

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండలం చింతగుట్టలోని అంగన్‌వాడీ కేంద్రంలో శుక్రవారం ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సూపర్వైజర్ అరుణ మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు, మరియు పిల్లలు సరైన పోషకాహారం తీసుకోవడం అత్యవసరం అని సూచించారు. ఆరు నెలలు దాటిన పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనే దానిపై ఆమె వివరణ ఇచ్చారు.

అలాగే, మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలను అంగన్‌వాడీ కేంద్రానికి పంపించాలని, అక్కడ ఆటపాటల ద్వారా విద్య నేర్పించడం వల్ల పిల్లలు మానసికంగా, శారీరకంగా, మరియు సామాజికంగా మంచి ఎదుగుదల సాధిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమానికి హాజరైన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భాస్కర్ మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్య మహిళ సేవలను తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమంలో భాగంగా పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి అరికట్టవచ్చని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్, గ్రామ కార్యదర్శి, ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, తల్లులు, మరియు పిల్లలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad