Friday, July 4, 2025
E-PAPER
Homeఖమ్మంబాల్యం నుండే బాధ్యతగా వ్యవహరించేలా  పిల్లలను తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే జారే

బాల్యం నుండే బాధ్యతగా వ్యవహరించేలా  పిల్లలను తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే జారే

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
బాల్యం నుండే బాధ్యతగా వ్యవహరించే లా  పిల్లలను తీర్చిదిద్దాలని అపుడే ఉత్తమ పౌరులుగా రూపొందుతారు అని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. బాలల హక్కులు – మిషన్ విధివిధానాలు,”అమ్మ మాట – అంగన్వాడీ బాట” పేరుతో ఐసీడీఎస్ సిబ్బంది ఆద్వర్యంలో గురువారం నిర్వహించిన అవగాహన ర్యాలీ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులకు,సిబ్బందికి పలు సూచనలు చేశారు. మిషన్ సోషల్ వర్కర్ బాబు ముఖ్య వక్తగా పాల్గొని పిల్లల హక్కుల గురించి మిషన్ పని పద్దతులు,పథకం ఎవరికి వర్తిస్తుంది అనే అంశాలను వివరించి అవసరమైన డాక్యుమెంట్ల వివరాలను ఉపాధ్యాయులకు అందజేసారు. సీడీ పీఓ ముత్తమ్మ మాట్లాడుతూ రెండున్నర సంవత్సరాల వయస్సు వచ్చిన పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రంలో చేర్చి ప్రీ-స్కూల్ సిలబస్ ప్రకారం విద్యా కార్యక్రమాలు నిర్వహించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు విజయలక్ష్మి,సౌజన్య, పద్మావతీ,రమాదేవి,వరలక్ష్మీ, పోషణ అభియాన్ బీసీ శ్రీకాంత్,అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.పిల్లల అభివృద్ధి, ఆరోగ్యం, విద్య విషయంలో అంగన్వాడి కేంద్రాల పాత్ర ఎంతో ప్రాముఖ్య మైనదని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -