- Advertisement -
- – క్రమశిక్షణ, సంస్కారమే గుర్తింపుని స్తుంది…
– విద్యార్ధుల అభినందన సభలో ఎమ్మెల్యే జారె… - నవతెలంగాణ – అశ్వారావుపేట
- బడిలో ఉపాద్యాయులు విద్యార్ధులకు ఎంత బోధించిన ఇంటివద్ద పిల్లలను తల్లిదండ్రులు పర్యవేక్షిస్తూ,ప్రోత్సహిస్తే నే వారు అన్ని రంగాల్లో రాణిస్తారని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ట్రిపుల్ ఐటి చదువుకు అర్హత సాధించిన విద్యార్ధిని ల అభినందన సభ గురువారం ఆ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత అద్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. పిల్లలను సంస్కార వంతంగా బడికి పంపాల్సిన బాధ్యత తల్లిదండ్రుల దేనని,చదువు చెప్పి ఉత్తమ పౌరులుగా ఉపాద్యాయులు గా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధిస్తే,పాఠశాలకు మరిన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఉపాద్యాయులు పిల్లలకు ఆదర్శంగా వారితో పాటు యూనిఫాం సాధించాలని విజ్ఞప్తి చేసారు. అనంతరం ట్రిపుల్ ఐటి చదువుకు అర్హత సాధించిన పిల్లలతో పాటు తల్లిదండ్రులను శాలువాలు,జ్ఞాపికలు తో ఆయన సన్మానించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఎంఈఓ ప్రసాదరావు ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బోధనా సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు నరసింహారావు,కిషోర్,హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -