- Advertisement -
నవతెలంగాణ – మోపాల్ : మోపాల్ మండలంలోని మోపాల్ గ్రామంలో ఫాదర్స్ డే సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాలలో చిన్నారులు గ్రామ పెద్దలతో కలిసి “నాన్నకు ప్రేమతో” శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలోని పెద్దలు చిన్నారులు ఫాదర్స్ డే సందర్భంగా పువ్వులతో “నాన్నకు ప్రేమతో ” అని లిఖించి నాన్న పైన ఉన్న మమకారాన్ని చాటుకున్నారు. సమాజంలో బిడ్డ గెలిచినప్పుడు పదిమందికి చెప్పుకునే వ్యక్తి…. ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే వ్యక్తి నాన్న ఒక్కరే అన్నారు. వినూత్న రీతిలో అక్షర, ఆకృతి, కన్నయ్య పూలతో ఫాదర్స్ డే సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -