నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బెటర్ లైఫ్ మోడల్ స్కూల్ లో శుక్రవారం బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సంజీవరెడ్డి ప్రిన్సిపాల్ సౌజన్య మాట్లాడుతూ భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది నవంబర్ 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నమన్నారు. పిల్లలపై ఆయనకున్న అపారమైన ప్రేమను స్మరించుకుంటూ..ఈ రోజు పిల్లల ప్రతిభ, సృజనాత్మకత, సమాజ నిర్మాణంలో వారి పాత్ర చాలా గొప్పది అన్నారు. బాలలు దేశ భవిష్యత్తు, వారికి సరైన విద్య, హక్కుల అవగాహన, చట్ట పరిరక్షణ ఎంతో అవసరమన్నారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన లు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బెటర్ లైఫ్ మోడల్ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



