Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నలందలో ఘనంగా బాలల దినోత్సవం 

నలందలో ఘనంగా బాలల దినోత్సవం 

- Advertisement -

నవతెలంగాణ- ఆర్మూర్
పట్టణంలోని మామిడిపల్లి నలంద పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో  భాగంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపాల్ సాగర్ బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్  బాలల దినోత్సవం విశిష్టతను వివరిస్తూ మాట్లాడారు. చాచా నెహ్రూ గురించి విద్యార్థులకు వివరంగా తెలియజెప్పారు. విద్యార్థులకు నైతిక విలువలతో పాటు ఆధ్యాత్మిక విలువలను ఎలా పెంపొందించు కోవాలో వివరించారు. అనంతరం విద్యార్థులు తమ ఆటపాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయ బృందము పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -