Friday, November 14, 2025
E-PAPER
Homeజిల్లాలుపాఠశాలలలో ఘనంగా బాలల దినోత్సవం..

పాఠశాలలలో ఘనంగా బాలల దినోత్సవం..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చాచా నెహ్రూ, సమాజ సేవకులైన పోలీస్, డాక్టర్, ఆర్మీ, మదర్ థెరిస్సా వంటి వేషధారణలు, చిన్నారులు నృత్యాలు ఆకట్టుకున్నాయి. సిద్ధార్థ విద్యాలయం, చైతన్య విద్యానికేతన్, విజ్ఞాన్ పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం విద్యార్థులు గురువులుగా మారి విద్యార్థులకు విద్యా బోధన చేశారు. చైతన్య పాఠశాలలో జిల్లా ఇన్చార్జ్ ఎం సి హెచ్ ప్రోగ్రాం అధికారి యేమిమా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాఠశాలకు పూర్వ విద్యార్థి అయిన యేమిమా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ప్రతి విద్యార్థి పట్టుదలతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల కరస్పాండెంట్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -