నవతెలంగాణ – చండూర్
స్థానిక సన్ షైన్ పాఠశాలలో శుక్రవారం పండిట్ జవహర్లాల్ నెహ్రు జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారి సన్ షైన్ విద్యార్థులు ఫ్యాన్సీ డ్రెస్సు కార్యక్రమం ద్వారా అలరించడం జరిగింది. విద్యార్థినీ విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఆహ్లాద పరిచారు. ఈ కార్యక్రమాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు కరస్పాండెంట్ కోడి వెంకన్న బహుమతులను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముందుగా అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి బాలలే రేపటి భారత భవిష్యత్తుగా ఉంటారు కాబట్టి క్రమశిక్షణతో మంచి నడవడికతో తల్లిదండ్రులకు పాఠశాలకు, భారతదేశానికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మ , ప్రిన్సిపాల్ రవికాంత్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
సన్ షైన్ లో ఘనంగా బాలల దినోత్సవం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



