Friday, November 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – తుంగతుర్తి
బాలలు భావి భారతావని స్వప్నాలని, వెంపటి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనరసమ్మ అన్నారు. శుక్రవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి, వారి సేవలను గుర్తుచేసి నివాళులర్పించారు. ఈ మేరకు పిల్లల పట్ల అపారమైన ప్రేమను చూపించిన నెహ్రూను అంతా ‘చాచా నెహ్రూ’ అని ఆప్యాయంగా పిలుచుకునే వారని అన్నారు. పిల్లలే దేశ భవిష్యత్తుకు నిజమైన నిర్మాతలని నెహ్రూ బలంగా విశ్వసించారు అని గుర్తు చేశారు. బాలల దినోత్సవం ఒక పండుగ కాదని, ఇది పిల్లల హక్కులు, విద్యా, ఆరోగ్యం, సమాన అవకాశాలపై అవగాహన పెంచే రోజు అని అన్నారు.

పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, సమాజం పట్ల బాధ్యత పెంపొందించడమే, ఈరోజు ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రతి విద్యార్థి చిన్నతనం నుండే ఉన్నత లక్ష్యాలను ఎంపిక చేసుకుని వాటి సాధన కోసం కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల వేషధారణ సాంస్కృతి కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం మల్లెపాక రవీందర్, గుండ్ల ఆంజనేయులు, గట్టు మాధవి, బండారు భవాని, నవీన, జీడి అనిల్ కుమార్, మిట్టగడుపుల విక్రం, మాలోతు కృష్ణ, రమాదేవి, మంజుల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -