Thursday, March 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'ఎనుమాముల'కు తగ్గిన మిర్చి దిగుబడులు

‘ఎనుమాముల’కు తగ్గిన మిర్చి దిగుబడులు

- Advertisement -

నిలకడ లేని ధరలు
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో మిర్చి ధరలు ఒక రోజు తగ్గి మరో రోజు పెరుగుతూ అంటున్నాయి. ముందు అమ్ముకున్న రైతాంగం ఆందోళన చెందుతోంది. ధరల్లో స్థిరత్వం ఉండాలని కోరుకుంటున్నారు. మార్కెట్‌లో సోమవారం 45 వేల బస్తాల మిర్చి రాగా, మంగళవారం 35 వేల బస్తాలు, బుధవారం 30వేల బస్తాల మిర్చి వచ్చింది. సోమవారం ధరలు పెరగడంతో ఒకింత రైతాంగంలో హర్షం వ్యక్తమైంది. మంగళవారానికి వచ్చేటప్పటికీ ధరలు తగ్గడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మిర్చి సాగు గణనీయంగా తగ్గి, దిగుబడులు పడిపోయినా మార్కెట్‌లో ధరలు తగ్గుతుండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమ, మంగళవారానికి ధరల్లో తగ్గుదల ఉన్నా బుధవారానికి కొంత మేర మెరుగుపడింది. అయితే, మిర్చి దిగుబడులు పడిపోవడం రెండేండ్లు గా జరుగుతూనే ఉంది.

2020-21, 2021-22 సంవత్సరాల్లో ఎనుమాముల మార్కెట్‌కు ఫిబ్రవరిలో 1,64,831 క్వింటాళ్లు, 1,35,166 క్వింటాళ్లు రాగా, 2022-23, 2023-24లో మిర్చి రాబడులు 2,49,267 క్వింటాళ్లు, 2,68,769 క్వింటాళ్లు వచ్చాయి. గత రెండేండ్లతో పోల్చితే సుమారుగా ఈ రెండేండ్లు 1 లక్ష క్వింటాళ్ల మిర్చి దిగుబడులు పెరగడం గమనార్హం. 2024-25లో 48,970 క్వింటాళ్లు, 2025-26లో ఇప్పటివరకు 41,839 క్వింటాళ్ల మిర్చి మాత్రమే వచ్చింది. ప్రతియేటా మిర్చి మార్కెట్‌కు డిసెంబర్‌లో రావడం ప్రారంభమవుతుంది. వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌కు ఆరేండ్లుగా ఫిబ్రవరిలో మాత్రమే వచ్చిన మిర్చి సరుకు, వ్యాపారులు పెట్టిన మోడల్‌ ధరలను పరిశీలిస్తే మిర్చి దిగుబడుల హెచ్చు, తగ్గులు, ధరల పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.



- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -