నవతెలంగాణ- నూతనకల్
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచిగా పోటీ చేసి సందర్భంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగా శనివారం మండల కేంద్ర మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామ సర్పంచ్ అంజపెళ్లి నరసమ్మ కట్టు కాలువలో ఉన్న కంపచట్ల తొలగింపు ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను గ్రామ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానన్న హామీలో భాగంగా గ్రామంలో ఉన్న ప్రధాన కాలువ అయినా కట్టు కాలువకు ఇరువైపులా ఉన్న కంపచట్లను జెసిపి సహాయంతో తన సొంత ఖర్చులతో తొలగిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం గ్రామం నుండి మండల కేంద్రం వరకు పూర్తిగా గుంతలమయమైన రోడ్డుకు డోజర్ సహాయంతో సమానంగా చేసి గుంటలు ఉన్న ప్రదేశంలో తాత్కాలిక మరమ్మత్తుగా కంకర డస్టును పోయిస్తున్నట్లు తెలిపారు. ఇదే కాకుండా తాను ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థిగా అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో వారి సమన్వయంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సామ సురేందర్ రెడ్డి వార్డు సభ్యులు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం , మండల కమిటీ సభ్యులు అంజపెళ్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.



