Friday, April 3, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహార్ముజ్‌ గురించి 'అన్ని పక్షాలతో' చైనా సంప్రదింపులు

హార్ముజ్‌ గురించి ‘అన్ని పక్షాలతో’ చైనా సంప్రదింపులు

- Advertisement -

హార్ముజ్‌ జలసంధి స్థిరత్వాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం గురించి తాము అన్ని పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని చైనా తెలిపింది. ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివరించింది. ”హార్ముజ్‌ జలసంధి, దాని సమీప జలాల్లో త్వరితగతిన కాల్పుల విరమణ, శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడం అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ఆకాంక్ష అని మేము విశ్వసిస్తున్నాం. అన్ని పక్షాలూ ఈ లక్ష్యం కోసం కృషి చేయాలి” అని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్‌ అన్నారు. చైనా అన్ని పక్షాలతో సంప్రదింపులు, సమన్వయం కొనసాగిస్తోందని చెప్పారు. హార్ముజ్‌ జలసంధిలో నౌకాయానానికి అంతరాయం కలగడానికి మూల కారణం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ తీసుకున్న చట్టవిరుద్ధమైన సైనిక చర్యలేనని మావో తెలిపారు. ఆ ప్రాంతంలో భద్రతను పునరుద్ధరించడానికి శుత్రుత్వాన్ని అంతం చేయడమే మార్గమని ఆమె చెప్పారు. సైనిక మార్గాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించలేమనీ, సంఘర్షణ తీవ్రతరం కావడం ఏ పక్షానికీ ప్రయోజనకరం కాదని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -