Tuesday, July 8, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబ్రిక్స్ దేశాలకు ట్రంప్ సుంకాల వార్నింగ్‌పై చైనా కౌంట‌ర్

బ్రిక్స్ దేశాలకు ట్రంప్ సుంకాల వార్నింగ్‌పై చైనా కౌంట‌ర్

- Advertisement -


నవతెలంగాణ-హైద‌రాబాద్: బ్రిక్స్‌ అనుకూల దేశాలపై అదనపు టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై చైనా కౌంట‌ర్ ఇచ్చింది. “బ్రిక్స్ అంతర్జాతీయ సమాజంలో సానుకూల శక్తి అని మేము విశ్వసిస్తున్నామ‌ని. దాని సహకారం బహిరంగంగా, అందరినీ కలుపుకొని ఉంటుంద‌ని ఆ దేశ విదేశాంగ మంత్రి మావో నింగ్ అన్నారు. ఏ ప్రత్యేక దేశాన్ని లక్ష్యంగా చేసుకోద‌ని స్ప‌ష్టం చేశారు.సుంకాల యుద్ధాలు, వాణిజ్య యుద్ధాలను తాము నిరంతరం వ్యతిరేకిస్తున్నామ‌ని, ఏకపక్షంగా సుంకాలు విధించడం స‌రైన విధానం కాద‌ని ఆమె వెల్ల‌డించారు.

బ్రెజిల్‌ వేదికగా బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్నవేళ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ‘‘బ్రిక్స్‌లో అమెరికా వ్యతిరేక విధానాలకు మద్దతిచ్చే ఏ దేశానికైనా అదనంగా 10శాతం టారిఫ్‌లు విధిస్తాం. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవు’’ అని స్పష్టంచేశారు.

బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికాలతో ఏర్పడిన బ్రిక్స్‌ కూటమిలో ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్‌, సౌదీ అరేబియా, యూఏఈలు ఆ తర్వాత చేరిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -