బీజింగ్ : చైనా తన వీసా నిబంధనలను సడలించింది. 70 దేశాలకు చెందిన పౌరులకు వీసా అవసరం లేదంటూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 30 రోజులపాటు తమ దేశాన్ని సందర్శించడానికి అనుమతిస్తున్నామని సోమవారం ప్రకటించింది. దీంతో ఆ దేశ పర్యటక సంస్థలు, వ్యాపారులు ఎక్కువ మంది టూరిస్టులు చైనాకు వస్తారని భావిస్తున్నారు. చైనా అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరు చుకోవడానికి, పర్యాటకరంగ అభివృద్ధికి ఈనిర్ణయం తీసుకుంది. కోవిడ్ అనంతరం 1.38 కోట్ల మంది పర్యాటకులు మాత్రమే వచ్చారు, 2024 లో 2 కోట్లు రాగా ప్రస్తుతం రెట్టింపు వస్తారని ప్రభుత్వ వర్గాల అంచనా. 2023 డిసెంబర్‌లో ఫ్రాన్స్ , జర్మని, ఇటలీ , నెదర్లాండ్, స్పెయిన్, మలేషియా దేశాల పౌరులకు వీసా లేకుండా ప్రవేశాన్ని కల్పించింది. ప్రస్తుతం మొత్తం ఐరోపా దేశాలు, ఐదు లాటిన్ అమెరికా దేశాలు , నాలుగు మిడిల్ ఈస్ట్ దేశాలు, ఉజ్బెకిస్తాన్‌లతో పాటు అజర్ బైజాన్‌కు అవకాశం కల్పించనుంది. ఆఫ్రికా దేశాలతో సత్సంబంధాలున్నప్పటికీ వాటిని మినహాయించింది. ఈ కొత్తవీసా నిబంధన ప్రపంచ వ్యాప్తంగా పర్యా టకులను ఆకర్షి స్తుందని, కొత్త అవ కాశాలను కల్పిస్తుందని వైల్డ్ చైనా , ట్రిప్.కాం గ్రూప్ సంస్థలు ప్రకటించాయి.
చైనా వీసా 70 దేశాలకు ఉచితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES