– సైనిక చర్యలన్నీ తక్షణమే నిలిపేయాలని హితవు
బీజింగ్ : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యద్ధోన్మాద దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను నివారించడానికి చైనా ఐదు సూత్రాలను ప్రతిపాదించింది. బీజింగ్‌లో 14వ జాతీయ పీపుల్స్ కాంగ్రెస్ నాలుగో సెషన్ తర్వాత ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. ఇరాన్, మధ్యప్రాచ్చంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడానికి తాము దౌత్యపరమైన ఐదు కర్తవ్యాలను సూచిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వీటిలో మొదటిది తక్షణమే శత్రుత్వాలను విరమించి అన్ని రకాల సైనిక చర్యలను నిలిపివేయాలని, ప్రాణనష్టాన్ని నివారించడం అత్యంత ప్రధానమని పేర్కొన్నారు. సైనిక బలంతో రాజకీయ సమస్యలను పరిష్కరించలేమని పునరుద్ఘాటించారు. ఇక రెండోది : ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాల సరిహద్దులను, స్వతంత్రతను ఇతర దేశాలు గౌరవించాలని, బాహ్య శక్తుల జోక్యం ఉండరాదని హితవు పలికింది. మూడోది : అణువ్యాప్తిని అరకట్టిడానికి విస్తృత సంప్రదిం పులు, చర్చలు మాత్రమే సరైన మార్గమని పేర్కొన్నారు. నాలుగోది : హోర్ముజ్ జలసంధి వంటి కీలక వాణిజ్య మార్గాలను సురక్షితంగా ఉంచాలని సూచిం చింది. అంతర్జాతీయ ఇంధన సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమని పేర్కొన్నారు. ఇక ఐదోవది : మదధ్యప్రాచ్చ దేశాలు తమ భద్రత సమస్యలను తామే పరిష్కరించుకోవడానికి వీలుగా ఒక నూతన వేదికను ఏర్పాటు చేసుకోవాలని, బాహ్య దేశాల ‘జోక్యం’ లేని భద్రతా వ్యవస్థను చైనా ప్రోత్సహిస్తుందని తెలిపారు.
భారత్, చైనాలను ప్రత్యర్థులుగా చూడొద్దు ..
భారత్‌తో సంబంధాల గురించి కూడా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాలు ఒక దేశాన్ని మరొక దేశం ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా చూడాలని కోరారు. ‘భారత్, చైనాలు పరస్పరం ప్రత్యర్థుల్లా కాకుండా భాగస్వాములుగా ఉండాలి. అలాగే ఒకరికొకరు ముప్పు అని భావించకూడదు. పరస్పరం అభివద్ధికి తోడ్పడే అవకాశంగా చూడాలి. భారత్, చైనాలు సత్సంబంధాలు, స్నేహాన్ని కాపాడుకో వాలి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వాన్ని సంయుక్తంగా కాపాడుకోవాలి. అలాగే అభివద్ధిపై దష్టి సారించాలి’ అని వాంగ్ యీ తెలిపారు. గతేడాది ఆగస్టులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ టియాంజిన్‌లో సమావేశమయ్యారని, ఆ మీటింగ్ విజయవంతమైందని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం (2024) కజాన్ వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌ల సమావేశం అయ్యారని, ఆ భేటీ అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందన్నారు వాంగ్ యీ. 2025లో తియాంజిన్‌లో ఇరు దేశాధినేతలు మరోసారి భేటీ అయిన తర్వాత ఆ సంబంధాల్లో మరింత మెరుగుదల కనిపించిందని తెలిపారు. అలాగే ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయికి చేరుకుందని స్పష్టం చేశారు. ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపడటం వంటివి ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూర్చాయని తెలిపారు.
సంక్షోభ నివారణకు చైనా ‘పంచసూత్రాలు’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



