- Advertisement -
జిల్లా ఫస్ట్, స్టేట్ 4వ ర్యాంక్..
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామానికి చెందిన చిందం భాస్కర్-హాసిని దంపతుల కుమారుడు చిందం గౌతమ్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026 ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. 9వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ జాతీయ స్థాయి పరీక్షలో గౌతమ్ జిల్లాలోనే మొదటి ర్యాంక్ సాధించి జిల్లా టాపర్‌గా నిలిచి, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 4వ ర్యాంక్ కైవసం చేసుకొని,జాతీయ స్థాయిలో 240వ ర్యాంక్ సాధించి తన మేధస్సును చాటారు. ఇందుకు తల్లిదండ్రులు, కాటారం ఆదర్శ పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేసి అభినందించారు.
- Advertisement -



