- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చైనా మాంజా వల్ల తీవ్ర కలకలం రేగింది. యాచారం మండలంలో బైక్‌పై వెళ్తున్న మధు అనే యువకుడి మెడకు చుట్టుకున్న మాంజా వల్ల అతనికి గాయాలయ్యాయి. అలాగే అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌పై వెళ్తున్న వీరయ్య అనే వ్యక్తికి కూడా చైనా మాంజా చుట్టుకుని గాయపరిచింది. ఇద్దరినీ వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
- Advertisement -



