Monday, January 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చైనా మాంజా వినియోగం నిషిద్ధం

చైనా మాంజా వినియోగం నిషిద్ధం

- Advertisement -

– వాడిన, అమ్మినా కఠిన చర్యలు తప్పవు..
రాయపోల్ ఎస్ఐ కుంచం మానస..
నవతెలంగాణ – రాయపోల్ 

ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా (నైలాన్ దారాలు) వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని రాయపోల్ ఎస్ఐ కుంచం మానస తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చైనా మాంజా కారణంగా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పక్షులు తీవ్రంగా గాయపడటంతో పాటు ప్రాణనష్టం సంభవించిన ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మండలంలో చైనా మాంజా నిల్వలు, విక్రయ కేంద్రాలపై ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.నిబంధనలను ఉల్లంఘించి చైనా మాంజాను వాడినా లేదా అమ్మినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మండల ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమ పిల్లలను చైనా మాంజా వినియోగానికి దూరంగా ఉంచాలని సూచించారు. నిబంధనలను పాటిస్తూ, చైనా మాంజా వల్ల కలిగే ప్రమాదాల నుంచి ప్రాణ భద్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మండలంలో ఎక్కడైనా నిషేధిత చైనా మాంజా వినియోగం లేదా విక్రయం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కనుకయ్య, కానిస్టేబుల్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -