Tuesday, March 24, 2026
E-PAPER
Homeఆటలుచిన్నస్వామి స్టేడియం తొక్కిస‌లాట‌..ఆర్సీబీ కీల‌క నిర్ణ‌యం

చిన్నస్వామి స్టేడియం తొక్కిస‌లాట‌..ఆర్సీబీ కీల‌క నిర్ణ‌యం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఈ నెల 28న ప్రారంభ‌కానుంది. మొద‌టి మ్యాచ్ చిన్న‌స్వామి స్డేడియం వేదిక‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆడ‌నుంది. ఈక్ర‌మంలోనే ఆర్సీబీ ఫ్రాంచైజీ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ)తో కలిసి కీలక నిర్ణయం తీసుకుంది. గ‌తేడాది జ‌రిగిన‌ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది అభిమానులకు గౌరవంగా నివాళులర్పించేందుకు.. స్టేడియంలోని 11 సీట్లను శాశ్వతంగా వారి పేరు మీద రిజర్వ్ చేశారు. భవిష్యత్తులో ఇక్కడ జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌లు సహా అన్ని ఈవెంట్లలో ఈ సీట్లు ఖాళీగానే ఉంటాయని అధికారులు తెలిపారు.

గతేడాది జూన్ 4న ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల భారీ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. సుమారు 3 లక్షల మంది అభిమానులు ఒక్కసారిగా గుమిగూడటంతో జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -