Wednesday, December 24, 2025
E-PAPER
Homeఆటలుతొలగని చిన్నస్వామి చిక్కులు?

తొలగని చిన్నస్వామి చిక్కులు?

- Advertisement -

విజయ్‌ హజారే మ్యాచ్‌ల వేదిక మార్పు
బెంగళూరు :
ఐపీఎల్‌ ట్రోఫీ కోసం 18 వసంతాలు ఎదురుచూసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ అభిమానులు.. ఈ ఏడాది ఆ జట్టు చాంపియన్‌గా నిలువటంతో చేసుకున్న విజయ సంబురాలు తీవ్ర విషాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటన, స్వతంత్ర దర్యాప్తు ఇప్పుడు చారిత్రక స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు ఆటంకంగా మారాయి. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో కోహ్లి ఆడగా.. ఢిల్లీ ఫిరోజ్‌ షా కోట్ల మైదానం అభిమానులతో కిక్కిరిసింది. విజరు హజారే ట్రోఫీలో ఢిల్లీ మ్యాచ్‌లు బెంగళూర్‌లో షెడ్యూల్‌ చేశారు. కానీ భద్రత కారణాలతో ఆ మ్యాచ్‌లను బెంగళూర్‌లోని సీఓఈలో నిర్వహించనున్నారు. కర్ణాటక క్రికెట్‌ సంఘం కొత్త అధ్యక్షుడు వెంకటేశ్‌ ప్రసాద్‌ చిన్నస్వామి స్టేడియంలో ప్రభుత్వ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించినా.. చిక్కులు తొలిగినట్టు కనిపించటం లేదు. సీఓఈలో మ్యాచ్‌లకు అభిమానులకు అనుమతించే అవకాశం లేదని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -