నవతెలంగాణ హలియా: జాతీయస్థాయి ఫుట్ బాల్ పోటీలకు నల్లగొండ జిల్లా హాలియా పట్టణానికి చెందిన చింతలచెరువు తేజు తెలంగాణ రాష్ట్ర జట్టు కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు. ఈనెల 12 నుండి 16 వరకూ హర్యానా రాష్ట్రం(పానిపట్) లో జరుగు అండర్ – 17 69వ జాతీయ స్థాయి ఫుట్ బాల్ పోటీలలో పాల్గొని,తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.గత నవంబర్ నెలలో నల్లగొండలో జరిగిన..అండర్ – 17 69వ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలలో ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టు నుండి ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
జాతీయస్థాయి పోటీలలో ఎంపికైన సందర్భంగా….. తన ఎంపికకు సహకరించిన…నల్లగొండ జిల్లా ఎస్.జి.ఎఫ్ సెక్రటరీ విమల, సీనియర్ పిడి,జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి, బొమ్మపాల గిరిబాబు, తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ ఫుట్ బాల్ అకాడమీ కోచ్ లింగా నాయక్, నల్లగొండ జిల్లా ఫుట్ బాల్ పేరెంట్స్ కమిటీ గార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రస్తుతం తేజు తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ ఫుట్ బాల్ అకాడమీ జనగామ జిల్లా కేంద్రంలో శిక్షణ పొందుతున్నాడు.



