Sunday, October 26, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచిరంజీవి అనుమతి తప్పనిసరి

చిరంజీవి అనుమతి తప్పనిసరి

- Advertisement -

కోర్టు కఠిన హెచ్చరికలు
నవతెలంగాణ-హైదరాబాద్‌

ప్రముఖ తెలుగు సినీ హీరో చిరంజీవి వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు శనివారం మధ్యంతర ఉత్తర్వులు మంజూరు చేసింది. ఇకపై ఎవరైనా చిరంజీవి అనుమతి లేకుండా ఆయన ఫొటోలు, గొంతు లాంటివి ఎవరైనా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం.. పోలీసులను ఆదేశించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పిటిషన్‌లో పేరు పొందిన పలువురితోపాటు ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ అయినా చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కులను ఉల్లంఘించే విధంగా ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయన పేరు, గాత్రం తదితర అంశాల్ని వినియోగించడాన్ని న్యాయస్థానం నిషేధించింది. అలానే కృత్రిమ మేథస్సు (ఏఐ)తో తయారు చేసిన మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలు వినియోగించడాన్ని కూడా ఆపివేయాలని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు దృష్టికి చిరంజీవి తీసుకువచ్చారు. ఆయన పేరుతో వీడియో, మీమ్స్‌ చేసి అనుమతి లేకుండా వినియోగిస్తున్నారని.. తద్వారా ఆయన ఖ్యాతి, గౌరవానికి నష్టం కలుగుతోందని చిరంజీవి తరఫు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు.

ఈ ఆదేశాల ప్రకారం చిరంజీవి పేరు, స్టేజ్‌ టైటిల్స్‌, గొంతు, ఆయనకు మాత్రమే సొంతమైన ఇతర వ్యక్తిత్వ లక్షణాలనీ, ఏ రూపంలోనైనా ఏ మాధ్యమంలోనైనా ఉపయోగించొద్దని న్యాయస్థానం ఆదేశించింది. గతంలో నాగార్జున కూడా ఇలానే న్యాయస్థానం నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -