Tuesday, November 4, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబెల్జియం సుప్రీంకోర్టును ఆశ్రయించిన మెహుల్‌ చోక్సీ

బెల్జియం సుప్రీంకోర్టును ఆశ్రయించిన మెహుల్‌ చోక్సీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు వేల కోట్లు ఎగవేసి పారిపోయిన వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరగాడు మెహుల్‌ చోక్సీ బెల్జియం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆంట్వెర్ప్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేశాడు. ఆంట్వెర్ప్ కోర్టు చోక్సీని అధికారులు అరెస్టు చేయడం సరైన చర్యేనని.. భారత్‌కు అప్పగించేందుకు అనుమతి ఇచ్చిందని ఓ అధికారి తెలిపారు. అక్టోబర్‌ 17న ఆంట్వెర్ప్‌ కోరు ఆర్థిక నేరగాడిని భారత్‌కు అప్పగించేందుకు అంగీకరించింది. అయితే, ఈ నిర్ణయంపై బెల్జియం ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌ చేసుకునే అవకాశం కూడా ఉందని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.

ఇదిలా ఉండగా.. ఆంట్వెర్ప్‌ కోర్టు తన తీర్పులో చోక్సీ నేరాలు భారత శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు చట్టం ప్రకారం శిక్షార్హమైనవేనని.. చోక్సీపై మోసం, దుర్వినియోగం, ఫోర్జరీ అభియోగాలు బెల్జియన్ చట్టం ప్రకారం కూడా శిక్షార్హమైనవని కోర్టు స్పష్టం చేసింది. అప్పగింత రాజకీయ ప్రేరేపితమని.. ప్రాథమిక హక్కుల ఉల్లంఘటన అంటూ చోక్సీ చేసిన వాదనలను ఆంట్వెర్ప్ కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -