పోప్ లియో ఉద్బోధ
రోమ్ : యుద్ధాలను ప్రారంభించే సత్తా ఉన్న వారు శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని పోప్ లియో సూచించారు. ఈస్టర్ పర్వదినం సందర్భంగా ఆయన సందేశాన్ని వినేందుకు వేలాది మంది ఆదివారం సెయింట్ పీటర్స్ స్క్వేర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా వాటికన్ బసిలికా సెంట్రల్ బాల్కనీలో నిలబడి ఆయన తన సందేశాన్ని అందించారు. ‘ఆధిపత్యం, అధికారం కావాలన్న కోరికను ఈ పండుగ రోజు అందరూ వీడాలి. యుద్ధాలతో నాశనమవుతున్న ప్రపంచానికి శాంతిని ప్రసాదించాలని ప్రభువును వేడుకుందాం’ అని అన్నారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ జరుపుతున్న యుద్ధాన్ని పోప్ లియో మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
ప్రపంచ ఘర్షణలను ఖండించేందుకు, ఉద్రిక్తతలను నివారించాలని కోరేందుకు ఆయన ఇటీవలి కాలంలో తన ప్రసంగాలను ఉప యోగించుకుంటున్నారు. ‘మనం హింసకు అలవాటు పడుతున్నాము. దానికి లొంగిపోతున్నాము. వేలాది మంది ప్రజల మరణాల విషయంలో ఉదాశీనంగా ఉంటున్నాము’ అని పోప్ లియో ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుధాలు కలిగిన వారు వాటిని విడనాడాలని, యుద్ధాలను ప్రారంభించే శక్తి ఉన్న వారు శాంతిని ఎంచుకోవాలని ఉద్బోధించారు. అయితే ఆయన తన ప్రసంగంలో ఏ దేశం పేరునూ, ఏ సంఘర్షణనూ ప్రస్తావించలేదు. గత సంవత్సరం ఈస్టర్ పర్వదినం రోజున, తన మరణానికి కొన్ని గంటల ముందు చివరి ప్రసంగం చేసిన పోప్ ఫ్రాన్సిస్‌కు ఆయన నివాళులు అర్పించారు. ఈస్టర్ పండుగ ప్రాధాన్యతను వివరిస్తూ ఎన్నో బాధలు అనుభవించిన సమయంలోనూ ఏసు పూర్తి అహింసావాదిగానే కొనసాగారని పోప్ లియో గుర్తు చేశారు.
శాంతి మార్గాన్ని ఎంచుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



