ఎమ్మెల్యే కారు దిగి పరారైన కాంగ్రెస్
13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో చైర్మెన్,వైస్ చైర్మెన్ ఎన్నికల సందర్భంగా సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కౌన్సిలర్ల ప్రమాణస్వీకార కార్యక్రమానికి క్యాంపు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు బస్సులో బయలుదేరారు. ఈ క్రమంలో చైర్మెన్ పదవి తనకు దక్కదనే అసంతృప్తితో ఉన్న 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి,ఆమె భర్త విప్లవ్ కుమార్‌ను స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన కారులో మున్సిపాలిటీ కార్యాలయానికి తీసుకు వస్తుండగా మున్సిపాలిటీ కేంద్రానికి రాగానే భారీకేడ్లను దాటే క్రమంలో వార్డు ప్రజలు,స్థానికులు ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు. ఆ సమయంలో కారు దిగిన బత్తుల వాణి పోలీసుల కండ్ల ముందే అక్కడి నుంచి పరార య్యారు. ఆమె మాత్రమే ప్రమాణస్వీకారం చేయ లేదు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఆరో పిస్తూ ఆమె అనుచరులు మున్సిపాలిటీ కార్యాల యం ఎదుట నిరసనకు దిగారు. స్థానికుల కు కాకుండా స్థానికేతరులకు చైర్మెన్ పదవి కట్టబెడు తున్నారని ఆరోపిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా మిగిలిన 12 మంది కౌన్సిలర్లు పోలీసుల భద్రత మధ్య చైర్మెన్,వైస్ చైర్మెన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మెన్ ఎన్నికల్లో హైడ్రామా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



