- Advertisement -
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో పెంత కోస్ట్ ఉజ్జివ దేవుని సంఘంలో గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘం కాపరి బ్రదర్ జ్యోతి ప్రవీణ్ తైదల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కాగా సర్పంచ్ సుమలత కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసి ప్రార్థనలు నిర్వహించి పేదలకు బట్టలు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జ్యోతి రాణి మోషే రమేష్ నరసయ్య శ్రీనివాస్ స్వాతి ఏమి మా చందు సంఘము పెద్దలు సామేలు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



