- Advertisement -
నవతెలంగాణ – మిడ్జిల్
మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిడ్జిల్, వాడియాల, మున్ననూర్, దోనూర్, చిల్వేర్, మల్లాపూర్, కొత్తూరు, తదితర గ్రామాలలో ఏసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. వాడియాల గ్రామంలో ఏసుక్రీస్తు జననం సందర్భంగా చిన్నారులతో నాటిక ప్రదర్శన నిర్వహించారు. మిడ్జిల్ చర్చిలో సర్పంచ్ ఎడ్ల శంకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు జాన్, రాజారత్నం, సువార్త రాజు, పరిమళ రాజు, మాజీ ఎంపీపీ సుదర్శన్, వివిధ రాజకీయ పార్టీ నాయకులు గౌస్ బాల్ రెడ్డి,విజయ్ కుమార్, భాస్కర్, సంఘ పెద్దలు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



