Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డి పట్టణంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు 

కామారెడ్డి పట్టణంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు 

- Advertisement -

– పాల్గొన్న కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు
నవతెలంగాణ –  కామారెడ్డి

కామారెడ్డి పట్టణంలో క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలు, వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు  అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ముందుగా యేసు క్రీస్తు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం క్రైస్తవ సోదరులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తూ, ప్రేమ, కరుణ, త్యాగం, మానవ సేవలే యేసు క్రీస్తు బోధనల సారమని పండ్ల రాజు పేర్కొన్నారు.

దేశంలో అన్ని మతాలు, కులాలు, వర్గాలు ఐక్యతతో కలిసి ఉండాల్సిన అవసరం ఉందని, క్రిస్మస్ వంటి పండుగలు సామాజిక సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మతసామరస్యానికి కట్టుబడి ఉందని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గొడుగుల శ్రీనివాస్,  కరంగుల అశోక్ రెడ్డి, జమీల్, కళ్లెం సత్యం, యూనుస్ క్రైస్తవ సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -