– కిక్కిరిసిన చర్చిలు- భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు
నవతెలంగాణ- దర్పల్లి
మండలంలోని దుబ్బాక, కేసారం, మైలారం, చల్లగర్గా, రేకులపల్లి, హోన్నజీపేట, దర్పల్లి, ఎస్బి తండా, దమ్మన్నపేట గ్రామాల్లో, గురువారం కృష్చియాన్ సోదరులు ఘనంగా క్రిస్మస్ వేడుకలను ఘంగా నిర్వహించారు. ఈసందర్బంగా అన్ని చేర్చిలకు రంగు రంగుల దీపాలుతో అలంకరించి ముస్తాబు చేశారు. పండగ పురస్కరించుకొని చేర్చిలన్ని భక్తుల సందడిగా మారాయి. ఆయా చేర్చిల్లోని ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి కీర్తను నిర్వహించారు. మండలకేంద్రములో ది లివింగ్ క్రైస్ట్ చేర్చిలో ఫాదర్ సుదీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్, కాంగ్రేస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ లు పాల్గొని క్రిస్తావ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. చర్చి మెంబర్స్ డేవిడ్, పోతారాజు, బెంజిమెన్, దామోదర్, దినకర్, ఎబినేజర్. తదితరులు పాల్గొన్నారు.
మండలంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



