నవతెలంగాణ – ఆర్మూర్: గతంలో రాజ్యాల, దేశాల చరిత్రలు వ్రాశారు. కానీ గ్రామాల చరిత్రలు వ్రాయడం చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. ఏ చరిత్రకైనా శిలా శాసనాలు, ప్రాచీన గ్రంథాలు, ప్రభుత్వ రికార్డులు, ఫర్మానాలు, (ఉత్తర్వులు) గెజిట్లు, శిథిల చిహ్నాలు, వృద్ధవాణి, ప్రాచీన వ్రాతప్రతులు మొదలగునవి ఆధారాలు. కథ, నవల, కవిత్వం వ్రాయడం సులువే. వీటికి అంత పెద్దగా ఆధారాలు అవసరం లేదు. కానీ చరిత్రకు ఆధారాలే చరిత్ర అంశాలు అవుతాయి. అలా జిల్లా పూర్వపు మోర్తాడ్ మండలం ప్రస్తుతం వేల్పూర్ మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన ప్రముఖ చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ స్వగ్రామం రామన్నపేటనే. రామన్నపేట చరిత్ర వ్రాయాలని 2002లో సంకల్పించారు.
2003 నుండి పరిశోధనను ఆరంభించి 2004 లో ఒక రూపం తెచ్చారు. అనేక వ్యయప్రయాసాలకోర్చి ఏప్రిల్ 2006 లో “మాతృభూమి రామన్నపేట” గ్రామ చరిత్రను 144 పేజీలతో లిఖించి లోకానికి అందించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొలి చారిత్రక గ్రంథం రామన్నపేట చరిత్ర. గతంలో మానవుల కార్యకలాపాలు మరియు సంఘటనల అధ్యయనమే చరిత్ర. రామన్నపేట చరిత్ర గ్రంథాన్ని తెలంగాణకు చెందిన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరులో 1925 నవంబర్ 20న జన్మించిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, ఐఐటి శిక్షకులు, హైదరాబాదులోని నల్లకుంటలో ఐఐటి శిక్షణ కేంద్రాన్ని స్థాపించి ఐఐటి శిక్షణలో మంచి పేరు సంపాదించి ఐఐటి రామయ్య అని పేరు తెచ్చుకున్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయుల నియోజకవర్గం నుండి 2007లో శాసనమండలి సభ్యుడుగా ఎన్నికై 2013 వరకు ఎమ్మెల్సీగా సేవలు అందించారు. ప్రముఖ చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ చుక్కా రామయ్య రామన్నపేట చరిత్ర గ్రంథాన్ని అందించగా చదివి “చరిత్రను వ్రాయడం చాలా కష్టమైన పనని, దాన్ని ఇష్టంగా మలిచావు రాజేశ్వరా…”! అని ప్రశంసించాడు. ప్రస్తుతం చుక్కారామయ్య వయస్సు 99 సంవత్సరాలు. ఈ సందర్భంగా కంకణాల రాజేశ్వర్ మాట్లాడుతూ చుక్కా రామయ్య ఆయురారోగ్యాలతో జీవించాలని అన్నారు.
రామన్నపేట చరిత్ర గ్రంథాన్ని ప్రశంసించిన చుక్క రామయ్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



