రేపు క్రిస్టమస్ వేడుకలు
క్రిస్టమస్ వేడుకల సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
నవతెలంగాణ – పాలకుర్తి
క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలో గల కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్ లో గల కార్మెల్ చర్చ్, ఆర్ సి ఎం, బిల్వర్స్ ఈష్టన్, బాప్టిస్ట్, జీజస్ గోప్సన్, అపోస్టలిక్, ఎబ్రోన్ చర్చలతో పాటు మండలంలోని గ్రామాల్లో గల చర్చిలు విద్యుత్ దీపాలతో ముస్తాబయ్యాయి. క్రిస్టమస్ వేడుకల సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. క్రిస్టమస్ వేడుకలను పురస్కరించుకొని క్రైస్తవులు గురువారం అర్ధరాత్రి నుండి ప్రార్థనలు నిర్వహిస్తారు
క్రిస్టమస్ శుభాకాంక్షలు
క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తిశ్రద్ధలతో క్రిస్టమస్ వేడుకలు జరుపుకుంటున్న క్రైస్తవులకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డిలు బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో క్రైస్తవులకు ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. క్రిస్టమస్ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.



