Wednesday, September 17, 2025
E-PAPER
Homeజిల్లాలుస్వగ్రామానికి మైక్ సెట్ వితరణ చేసిన సీఐ

స్వగ్రామానికి మైక్ సెట్ వితరణ చేసిన సీఐ

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని అమీర్ నగర్ గ్రామానికి చెందిన ఆర్మూర్ ట్రాఫిక్ సిఐ ఆకుల రఘుపతి తన స్వగ్రామానికి మైక్ సెట్ ను అందించారు. గ్రామస్తులకు ఏదైనా సమాచారాన్ని అందించేందుకు మైక్ సెట్ లేకపోవడం మూలంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఇటీవల సిఐ ఆకుల రఘుపతి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన బుధవారం మైక్ సెట్ ను తీసుకువచ్చి తన తల్లిదండ్రులు ఆకుల రాజన్న-సాయమ్మ చేతుల మీదుగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పుప్పల గంగాధర్ మాట్లాడుతూ అడిగిన వెంటనే కాదనకుండా గంట గంటకు సమయం తెలిపే సౌండ్ సిస్టం మైక్ సెట్ ను అందించి గ్రామస్తుల అవసరాన్ని తీర్చిన సిఐ ఆకుల  రఘుపతికి గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మలావత్ ప్రకాష్, క్యాతం రాజేందర్, తోట ప్రసాద్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -