నవతెలంగాణ – కల్వకుర్తి
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో నిర్వహిస్తున్న నవతెలంగాణ బుక్ హౌస్ ను స్థానిక సీఐ నాగార్జున సోమవారం సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న పుస్తకాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు పుస్తకాలను చదివే అలవాటును అలవర్చుకోవాలని, దీంతో ఎంతో జ్ఞానం వస్తుందని అన్నారు. నవతెలంగాణ నిర్వాహకులు బుక్ హౌస్ ఏర్పాటుచేసి ప్రజలకు జ్ఞానం అందించడం అభినందనీయమని అన్నారు. పుస్తకాలు చదివే అలవాటును తగ్గించుకోవడం ద్వారా ఎంతో నష్టపోతున్నామని ఆయన అన్నారు. వివిధ రకాల పుస్తకాలను బుక్ హౌస్ లో విక్రయించడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు పరుశరాములు, ఎస్ఐ మాధవరెడ్డి, కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా నాయకులు వెంకటేష్, దున్న సురేష్ తదితరులున్నారు.
నవతెలంగాణ బుక్ హౌస్ ను సందర్శించిన సీఐ నాగార్జున
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES