- Advertisement -
నవతెలంగాణ – ఆత్మకూరు
ఆత్మకూరు మండల పరిధిలోని గ్రామాల్లో బుధవారం డిసెంబర్ 31 పార్టీల పెరుతో యువకులు హంగామా సృష్టించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్. సంతోష్ హెచ్చరించారు. పార్టీలు ముగిసిన తర్వాత యువకులు చెరువులు, కుంటలు, బావుల్లో ఈతకు వెళ్లకుండా ఉండాలని స్పష్టం చేశారు. ఆయా గ్రామస్తులకు అసౌకర్యం కలగకుండా శాంతియుతంగా న్యూయర్ వేడుకలు జరుపుకోవాలని సీఐ సూచించారు. ద్రవ్య మత్తు వాడకం, రోడ్డు హంగామాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.
- Advertisement -



