విజ్ఞరాజా ఉత్సాహ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం
నవతెలంగాణ – పాలకుర్తి
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాజీవ్ చౌరస్తా జనగామ రోడ్డులో గల విజ్ఞరాజా వినాయకుని మండపంలో గురువారం పాలకుర్తి సీఐ జానకిరామ్ రెడ్డి, ఎస్సై పవన్ కుమారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజ్ఞరాజా ఉత్సాహ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని సిఐ జానకిరామ్ రెడ్డి తో పాటు ఎస్సై పవన్ కుమార్లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిఐ జానకిరామ్ రెడ్డి, ఎస్సై పవన్ కుమార్లు మాట్లాడుతూ.. వినాయకుల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. నిమజ్జనం సందర్భంగా నిర్వహించే ర్యాలీలో డీజే లను వాడరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు నంద సమ్మయ్య, అధ్యక్షులు పెద్దూరి శంకరయ్య, కమిటీ సభ్యులు శ్రీపాద ఉప్పలా చారి, కాటబత్తిని సోమన్న, బోవనగిరి కృష్ణమూర్తి, సోమన్న, శ్రీపాద సోమేశ్వర చారి,మారోజు ఉపేంద్ర చారి,శ్రీకాంత్,గుడ్ల రాజు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
విజ్ఞరాజా వినాయకుని మండపంలో సిఐ పూజలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES