Thursday, May 29, 2025
Homeతెలంగాణ రౌండప్రాజీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ నివేదన ఎత్తివేయాలి 

రాజీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ నివేదన ఎత్తివేయాలి 

- Advertisement -
  • – బీఆర్ఎస్వీ  నాయకులు, తడక సాయి 
    నవతెలంగాణ -తాడ్వాయి 
  • రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ వికాసం పథకం లబ్ధిదారులను సిబిల్ స్కోర్ ఆధారంగానే ఎంపిక చేస్తామని నిర్ణయించడాన్ని బీఆర్ఎస్వీ యూత్ నాయకులు తడక సాయి తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సిబిల్ స్కోర్ నిబంధన వెంటనే ఎత్తివేయాలని, రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన యువతి యువకులకందరికి రుణాలు మంజూరు చేయాలని, లేనియెడల యావత్,  యువత పెద్ద ఎత్తున ఆందోళన లు చేయనున్నట్లు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ బీసీలలో ఉన్న నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రూ. 6 వేల కోట్లతో 5 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని నిర్ణయం చేసి దరఖాస్తులు స్వీకరించిందన్నారు. కానీ ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 16 లక్షల మంది నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. దరఖాస్తులు స్వీకరణ పూర్తి అయిన తర్వాత సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టడమే అవుతుందని విమర్శించారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి సిబిల్ స్కోర్ లేకుండానే అర్హులందరికీ, యువతకు రాజీవ్ యువ వికాసం పథకం రుణాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -