Wednesday, March 25, 2026
E-PAPER
Homeబీజినెస్Cipla Health: మసాలా జామ రుచితో ప్రోలైట్‌ ఓఆర్ఎస్‌(ORS)

Cipla Health: మసాలా జామ రుచితో ప్రోలైట్‌ ఓఆర్ఎస్‌(ORS)

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O.) సిఫార్సు చేసిన ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ (ORS) ఫార్ములేషన్ ప్రోలైట్ ORS తయారు చేసే సిప్లా హెల్త్ లిమిటెడ్ సరికొత్త మసాలా జామకాయ ఫ్లేవర్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ వినియోగదారులను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కొత్త రకం ఓఆర్‌ఎస్‌ (ORS) నిరూపితమైన సామర్థ్యాన్ని భారతీయ రుచులతో మేళవించి హైడ్రేషన్‌ను కేవలం సమర్థవంతంగానే కాకుండా ఆనందదాయకంగా కూడా చేస్తుంది. శాస్త్రీయ ఆధారిత ఉపశమనాన్ని, సుపరిచితమైన రుచిని రెండింటినీ అందిస్తుంది.

అనేక ఏండ్లుగా ప్రోలైట్ ఓఆర్ఎస్‌(ORS)ను విశ్వసనీయ పేరుగా నిలిపిన సిప్లా హెల్త్ ఈ ఆవిష్కరణతో ఓరల్ రీహైడ్రేషన్ విభాగంపై తన నిబద్ధతను మరింత బలోపేతం చేసుకుంది. మసాలా జామకాయ రకంతో ఈ విభాగంలో  పదకొండు రుచులు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ శాస్త్రీయ ఆధారాలతో రూపొందించినవే కాకుండా, ఎటువంటి రాజీ లేని ప్రభావం, రుచి రెండింటినీ అందిస్తూ హైడ్రేషన్ పరిష్కారాలకు పెరుగుతున్న డిమాండ్‌ తీర్చనున్నాయి.

ఈ ఆవిష్కరణపై సిప్లా హెల్త్ సీఈఓ& ఎండీ శివమ్ పూరీ మాట్లాడుతూ, “సంపూర్ణ ఆరోగ్యం, బాగోగులును కాపాడుకోవడంలో హైడ్రేషన్ ఒక ప్రాథమిక భాగం, ప్రత్యేకించి భారత్‌ వంటి దేశంలో వాతావరణ పరిస్థితులు, చురుకైన జీవనశైలి డీహైడ్రేషన్ ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రోలైట్ ఓఆర్‌ఎస్‌ (ORS) ఎల్లప్పుడూ మీరు విశ్వసించగల విజ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. దీనికి మసాలా జామకాయ జోడించడంతో వినియోగదారులు అనారోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ప్రతిరోజూ దీనిని తమ దైనందిన జీవితంలో ఒక తెలివైన హైడ్రేషన్ అలవాటుగా మార్చుకోవడానికి ఒక కారణంగా నిలుస్తుంది” అన్నారు.

ఈ కొత్త రకం కచ్చితమైన తయారీ విధానాన్ని వినియోగదారుల అభిరుచులతో సమన్వయం చేసే ఒక విస్తృతమైన పరిశోధన, అభివృద్ధి ప్రక్రియ ఫలితం. నాణ్యత, సమర్థత ప్రమాణాలు అందుకోవడంతో పాటు, భారతీయ వినియోగదారులకు నచ్చే రుచిని అందించేలా చూసేందుకు ఈ రుచి అనేక దశల్లో పరీక్షలకు గురైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -