Saturday, March 7, 2026
E-PAPER
Homeజాతీయంసివిల్స్‌ ఫస్ట్‌ర్యాంకర్‌ అనుజ్‌ అగ్నిహోత్రి

సివిల్స్‌ ఫస్ట్‌ర్యాంకర్‌ అనుజ్‌ అగ్నిహోత్రి

- Advertisement -

తెలుగు రాష్ట్రాల నుంచి 30 మందికి బెటర్‌ ర్యాంకులు
అర్హత సాధించిన 958 మంది అభ్యర్థులు
పరీక్షా ఫలితాలు విడుదల చేసిన యూపీఎస్సీ


న్యూఢిల్లీ : సివిల్‌ సర్వీసెస్‌ 2025 పరీక్షా ఫలితాలను శుక్రవారం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ప్రకటించింది. రాజస్తాన్‌కు చెందిన ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్‌ అనుజ్‌ అగ్నిహోత్రి మొదటి ర్యాంకును సాధించారు. తమిళనాడుకు చెందిన రాజేశ్వరి సువే రెండో ర్యాంక్‌ పొందారు. ఈమె ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్యానాకు చెందిన అకాన్ష్‌ ధూల్‌ మూడో స్థానంలో నిలిచారు. ఈయన బీజేపీ నాయకులు కిషన్‌ధూల్‌ కుమారుడు. కాగా, ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 30 మంది అభ్యర్థులు సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. వీరిలో తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన గుడెల్లి సృజన 55వ ర్యాంక్‌ సాధించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -