– హోలీ పండుగ రోజు ఘటన
– తల పగిలి విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స
నవతెలంగాణ-భిక్కనూర్
తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లోని హాస్టల్‌లో జరిగిన హౌలీ వేడుకల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని బీటీఎస్ వద్ద ఉన్న సౌత్ క్యాంపస్‌లో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యార్థులు కొందరు మద్యం మత్తులో ఆకస్మికంగా వచ్చి ఇతర విద్యార్థులపై అనవసరంగా అసభ్యంగా ప్రవర్తిస్తూ వాగ్వాదం చేశారు. దాంతో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన మాటల తగాదా తీవ్రరూపం దాల్చి దాడికి దారితీసింది. వీరిలో ఒక జూనియర్ విద్యార్థి తీవ్రంగా గాయపడి తలకు రక్తస్రావం జరిగింది. గాయపడిన విద్యార్థిని దగ్గరలోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆస్పత్రి నుంచి వచ్చిన జూనియర్ విద్యా ర్థులు కాలేజీ ఆవరణలో తమపై దాడి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేసి 3 గంటల పాటు ప్రిన్సిపాల్ చాంబర్ ఎదుట విద్యా ర్ధులు ఆందోళన చేశారు. బాధిత విద్యార్థి బంధువులు కాలేజీకి చేరుకుని దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులతో కలిసిన డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డి జూనియర్ విద్యార్థులపై దాడి చేసిన ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేయడంతో ఆందోళన విరమించారు.
తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



